Sunday, February 23, 2025
Homeసినిమారెండు వేల మంది అఘోరాలతో ‘ఎర్ర‌ చీర‌’

రెండు వేల మంది అఘోరాలతో ‘ఎర్ర‌ చీర‌’

Shoot with 2K Aghoras:
కేజీఎఫ్ ఫేమ్ అయ్యప్ప పీ శర్మ కీల‌క పాత్ర‌లో, బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ఎర్రచీర’. సి.హెచ్ వీ సుమన్‌ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హార‌ర్ యాక్షన్ స‌స్పెన్స్ ప్ర‌ధానంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సౌత్ ఇండియా సినిమాగా  రూపొందుతోంది. ‘మ‌హాన‌టి’ ఫేం బేబి సాయి తేజ‌స్వి మ‌రో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు.

అఖండ సినిమాకు గ్రాఫిక్స్ అందించిన మాట్రిక్స్ సంస్థ  ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన గ్రాఫిక్స్ వర్క్ చేపడుతోంది. 30 నిముషాల ఈ కీలకమైన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసే పనిలో గ్రాఫిక్స్ టీం తలమునకలు అయ్యింది. తాజాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి అయిన అయ్యప్ప పి శర్మ మరియు  రెండు వేల మంది అఘోరాలతో క్లైమాక్స్ షూటింగ్ జరిగింది. ఈ పార్ట్ మొత్తానికే హైలైట్ అని దర్శక నిర్మాతలు ధీమాగా చెబుతున్నారు. ఇక గ్రాఫిక్స్ పార్ట్ లేట్ కావడంతో సినిమా విడుదల కూడా కొంచెం లేట్ అయ్యింది. శివరాత్రికి సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సుమన్ బాబు, కారుణ్య చౌదరి, అలీ, రఘుబాబు, అజయ్, భద్రం, మహేష్, గీతా సింగ్, క‌మల్ కామ‌రాజు, సురేష్ కొండేటి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : సూపర్ క్రైమ్ థ్రిల్లర్ రెక్కీ షూటింగ్ పూర్తి

RELATED ARTICLES

Most Popular

న్యూస్