Thursday, May 30, 2024
Homeసినిమాపూజ హెగ్డేను పట్టుకోవడం ఇక కష్టమేనేమో! 

పూజ హెగ్డేను పట్టుకోవడం ఇక కష్టమేనేమో! 

Pooja-Unstoppable: టాలీవుడ్లో ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే, అందరి నోటివెంట వెలువడే పేరు పూజ హెగ్డే. కొంతకాలంగా ఆమె దూకుడు మామూలుగా లేదు. నాజూకుదనానికి నమూనాగా నిలిచే పూజ హెగ్డే, వరుస అవకాశాలతో పాటు వరుస విజయాలను కూడా సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అయితే ‘రాధే శ్యామ్’ సినిమా ఆశించినస్థాయిని అందుకోకపోవడం ఆమె అభిమానులకు కాస్త  నిరాశను కలిగించే విషయం. అందులో ఆమె తప్పేమీ లేకపోయినా, ఆ ఎఫెక్ట్ కొంతవరకూ ఉంటుంది.

అలా అని చెప్పేసి పూజ కంగారుపడిపోయి కాళ్లు తొక్కుకోవలసిన పనిలేదు. తెలుగులో భారీ చిత్రమైన ‘ఆచార్య’ .. ‘తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన చేసిన ‘బీస్ట్’ ఆమె చేతిలో ఉన్నాయి. విజయ్ కెరియర్లో అత్యధిక భారీ బడ్జెట్  చిత్రాలలో ఒకటిగా ‘బీస్ట్’ నిర్మితమైంది. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 13వ తేదీన  సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. టిక్కెట్ల కోసం ఆయన అభిమానులంతా ఆన్ లైన్లో కూర్చున్నారు.  భారీతనమనేది ఈ సినిమా ప్రధమ లక్షణంగా .. ప్రధాన లక్షణంగా కనిపిస్తోంది.

ఇక ఆ తరువాత  ఏప్రిల్ 29వ తేదీన ‘ఆచార్య’ సినిమా  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక వైపున చిరూ .. మరో వైపున  చరణ్ రధచక్రాలుగా మారి నడిపించే కథ ఇది. ఈ సినిమాలో ‘నీలాంబరి’ లుక్ లో పూజ మంచి మార్కులు కొట్టేసింది. చరణ్ సరసన ఆమె ఆటపాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘రాధే శ్యామ్’ ను కలుపుకుని చూసుకుంటే, పూజ చేసిన మూడు భారీ బడ్జెట్ సినిమాలు ఇంత తక్కువ గ్యాపులో రావడం విశేషమే. ఈ రెండు సినిమాలు హిట్ అయితే టాలీవుడ్ లో పూజ స్థానానికి ఢోకా లేనట్టే. ఇక కోలీవుడ్ లో కూడా ఆమె బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఆమె పారితోషికానికి రెక్కలు రావడం సహజమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాల తరువాత ఆమెను పట్టుకోవడం కష్టమే అవుతుందేమో!

Also Read : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ట్రిపుల్ ఆర్ టీమ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్