Saturday, January 18, 2025
Homeసినిమా'గాడ్ ఫాద‌ర్' షూటింగ్ పూర్తి కాలేదా?

‘గాడ్ ఫాద‌ర్’ షూటింగ్ పూర్తి కాలేదా?

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్‘.  మోహ‌నరాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. నాలుగైదు రోజులుగా ఊరిస్తూ వచ్చిన ‘తార్ మార్ తక్కర్ మార్’ సాంగ్ ను రిలీజ్ చేశారు. రాబోయే రోజుల్లో వరుస అప్ డేట్స్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు మేక‌ర్స్.

అయితే.. విడుదలకు కేవలం రెండు వారాలే ఉండగా.. ఇంకా షూట్ పెండింగ్ ఉన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. మలయాళంలో ఘన విజయం సాధించిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా గాడ్ ఫాదర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే.. మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కథలో మార్పులు చేర్పులు చేశారు. ఇందులో భాగంగా చిరంజీవి, సల్మాన్ లతో ఓ డ్యాన్స్ నంబర్ ని షూట్ చేశారు. అయితే.. ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ని కూడా పెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమా అంతా కంప్లీట్ అయినా.. ఆ ఐటెమ్ నంబర్ షూటింగ్ మాత్రం ఇంకా మిగిలిపోయే ఉందట. ఇప్పుడు ఈ పాటని ముంబైలో షూట్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట. మెగా సాంగ్ లో బింబిసార ఫేమ్ వారినా హుస్సేన్ ఐటెమ్ భామగా కనిపించనుందని అంటున్నారు. అయితే.. ఈ పాటలో చిరు భాగం అవుతాడు కానీ.. ఐటమ్ గర్ల్ తో కలిసి స్టెప్పులు వేయడట. కేవలం ఇంటర్ కట్స్ లో మాత్రమే మెగాస్టార్ ని చూపిస్తారట. మరి.. ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.

Also Read : గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ థార్ మార్ పాట విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్