Saturday, January 18, 2025
Homeసినిమాఆచార్యకు అడ్డు తొలిగిన సమ్మర్ సోగ్గాళ్ళు

ఆచార్యకు అడ్డు తొలిగిన సమ్మర్ సోగ్గాళ్ళు

F3 -last postpone: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల‌తో వ‌స్తోన్న ఫన్-ఫిల్డ్ ఎంటర్టైనర్ `ఎఫ్‌3` ఈ వేస‌వికి మూడు రెట్ల వినోదాన్ని అందించనుంది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకం పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కాస్త ఆల‌స్యంగా మే27న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.  ఇప్పటికే ఈ సినిమా రెండు మూడు సార్లు విడుదల తేదీ వాయిదా పడింది. ఏప్రిల్ 28న విడుదల చేస్తామని దిల్ రాజు గత నెలలో ప్రకటించారు. అయితే ఏప్రిల్ 29న ఆచార్య ఉండడంతో అంతకుముందు రోజే ఈ సినిమా విడుదల చేయడం సరికాదని భావించి ఒక నెల రోజులపాటు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తాజాగా ఫస్ట్ సింగిల్ ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు’ పాట విడుద‌లై విశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఈ పాటలో డబ్బుకు ఉన్న శక్తి, గొప్పదనాన్ని వివరించారు. ఈ క‌థ డబ్బు చుట్టూ తిరుగుతుంది. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Also Read : ఫిబ్రవరి 7న ‘ఎఫ్ 3’ ఫస్ట్ సింగిల్ ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు’

RELATED ARTICLES

Most Popular

న్యూస్