Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

F3: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్3 ‘ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న ఈ చిత్రం .. ‘ఫన్’టాస్టిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పాకళావేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో చాలా స్పెషల్ హైలెట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. విక్టరీ వెంకటేష్ ఎఫ్ 3లో తన పాత్రని అనుకరిస్తూ రేచీకటి వున్నట్లు వేడుకలో ఎంట్రీ ఇవ్వడంలో ఆకట్టుకుంది. అలాగే ఎఫ్ 2 వెర్సస్ ఎఫ్ 3 టీమ్స్ మధ్య వేదిక పై జరిగిన పోటి కూడా అభిమానులని అలరించింది. అలాగే సునీల్ మూకీ యాక్ట్ కూడా అలరించింది.

ఈ ‘ఫన్’టాస్టిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. మూడేళ్ళ తర్వాత ఎఫ్ 3 రూపంలో నా సినిమా మే 27 థియేటర్ లోకి వస్తుంది. అంతకు ముందు చేసిన నారప్ప, దృశ్యం ఓటీటీలో విడుదలయ్యాయి. మళ్ళీ ఎఫ్ 3లో మీ అందరినీ థియేటర్ లో కలవడం చాలా ఆనందంగా వుంది. ఎఫ్ 3 ని ప్రేక్షకులంతా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతమైన స్క్రిప్ట్ చేశారు. దిల్ రాజు గారితో పని చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చింది.వరుణ్ తేజ్ అద్భుతంగా చేశాడు. ఈ సినిమాలో పని చేసిన నటీనటులకు, టెక్నిషియన్ల అందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటులు అన్నపూర్ణమ్మ గారు, విజయ గారు నాపై ఎంతో ప్రేమతో మద్రాస్ నుండి భోజనం తీసుకొచ్చేవారు. వారు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఈ ఈవెంట్ సూపర్ ఎక్స్ ట్రార్డినరీ అదిరిపోయింది. ఎఫ్ 3 కూడా అదిరిపోతుంది. మీరంతా థియేటర్ లో సినిమా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “ఎఫ్ 3 అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాలో నటించిన నటీనటులకి, టెక్నికల్ టీం కి థ్యాంక్స్. ఈ సినిమాలో సునీల్ గారితో నా కాంబినేషన్ చాలా చక్కగా వచ్చింది. మళ్ళీ పాత సునీల్ ని చూస్తారు. దిల్ రాజు, శిరీష్ గారి సినిమా అంటే నా హోం ప్రొడక్షన్ లా ఫీలౌతా. ఫిదా, ఎఫ్ 2 లాంటి సూపర్ హిట్స్ దిల్ రాజు గారి బ్యానర్ లో చేశాను. ఎఫ్ 3తో హ్యాట్రిక్ కొడతామనే నమ్మకం వుంది. ప్రొడక్షన్ టీం అద్భుతంగా పని చేసింది. దేవిశ్రీ ప్రసాద్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి నా బ్రదర్ , అద్భుతమైన వ్యక్తి. ప్రస్తుత కాలంలో అనిల్ అంత కామెడీ ఎవరూ పండించలేరని నా నమ్మకం. ఎఫ్ 3తో మళ్ళీ అది ప్రూవ్ చేస్తారు. వెంకటేష్ గారితో రెండోసారి చేసే అదృష్టం నాకు దక్కింది. ఆయనతో నా ప్రయాణం మర్చిపోలేను. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది”అన్నారు.

Also Read : ‘ఎఫ్3’ చిత్రానికి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com