RCB New Captain: ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) కెప్టెన్ గా సౌతాఫ్రికా ఆటగాడు డూప్లెసిస్ ను ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం నియమించింది. 2008 నుంచి 2021 వరకూ విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్ గా వ్యవహరించాడు. గత సీజన్ సమయంలో తాను కెప్టెన్ బాధ్యతల నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఆర్సీబీ యాజమాన్యం కూడా కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపింది. తాను కెప్టెన్ గా వైదొలగినప్పటికీ తాను ఐపీఎల్ ఆడినంత కాలం బెంగుళూరు కే ఆడతానని కోహ్లీ స్పష్టంగా చెప్పాడు.
2012లో ఐపీఎల్ టోర్నీకి ఆరంగ్రేటం చేసిన డూప్లెసిస్ 2015 వరకూ చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడాడు. 2016,17 సీజన్లలో పూణే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018 నుంచీ గత సీజన్ 2021 వరకూ చెన్నై జట్టుకే ఆడాడు గత నెలలో జరిగిన వేలం పాటలో డూప్లెసిస్ ను బెంగుళూరు కొనుగోలు చేసింది.
మార్చి 26 నుంచి ఈ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో నేడు సమావేశమైన బెంగుళూరు ఫ్రాంచైజీ డూప్లెసిస్ ను కెప్టెన్ గా ఎంపిక చేసింది. డూప్లెసిస్ నేతృత్వంలో ఆడుతున్నందుకు ఆనందంగా ఉందని కోహ్లీ వ్యాఖ్యానించాడు.