Friday, March 29, 2024
HomeTrending Newsరాజకీయం చేయొద్దు : ఆళ్ల నాని

రాజకీయం చేయొద్దు : ఆళ్ల నాని

don’t politicize: జంగారెడ్డిగూడెం మృతుల్లో కేవలం ఐదారుగురు మాత్రమే కల్తీ సారా తాగి చనిపోయారని, మిగిలినవారు వివిధ వేర్వేరు కారణాలతో మృతి చెందారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని వెల్లడించారు. కొంతమంది దీర్ఘ కాలిక వ్యాధులతో ఉంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తే, వాటిని కూడా కల్తీ సారా మృతులుగా చూపెడుతున్నారని నాని ఆరోపించారు. జంగారెడ్డి గూడెంలో అయన మీడియాతో మాట్లాడారు.

ప్రతిపక్ష నేతలు మృతుల ఇళ్ళకు వెళ్లి ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం వస్తుందని ఆశ చూపి, కల్తీ సారా వల్లే చనిపోయినట్లుగా మృతుల బంధువులతో ఫిర్యాదులు ఇప్పిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని నాని చెప్పారు.  ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడడం మానుకోవాలని నాని సూచించారు. పేదలను, కూలీ నాలీ చేసుకొని జీవించే వారిని ఈ విధంగా ఆశ చూపి ఆ మరణాలను రాజకీయం చేయడం దారుణమన్నారు.

రాష్ట్ర ప్రజలంతా సిఎం జగన్ పరిపాలనను మెచ్చుకుంటున్న తరుణంలో ఆయన్ను అప్రదిష్ట పాలుజేయాలనే తెలుగుదేశం పార్టీ నేతలు ఈ పనులు చేస్తున్నారని నాని విమర్శించారు. దురదృష్టకర సంఘటనలు జరిగితే వాటిని రాజకీయ లబ్ధికోసం వాడుకోవడం టిడిపికి అలవాటైందన్నారు. రేపో మాపో చంద్రబాబు కూడా పరామర్శ పేరుతో క్కడకు వచ్చి రాజకీయం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు.

సంఘటనపై ప్రతిపక్షనేత చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.  పశ్చిమ గోదావరి జిల్లాకు ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్న పేర్ని నాని జంగారెడ్డి గూడెంలో వరుస మరణాలపై జిల్లా కలెక్టర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్