Saturday, January 18, 2025
Homeసినిమాజనవరిలో అయినా నాగ్ ప్రకటిస్తారా..?

జనవరిలో అయినా నాగ్ ప్రకటిస్తారా..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సంవత్సరం ‘బంగార్రాజు’ తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో నాగచైతన్య కూడా మాస్ పాత్రలో నటించి మెప్పించడం విశేషం. కళ్యాణ్‌ కృష్ణ  రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 65 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దీని తర్వాత నాగార్జున ‘బ్రహ్మాస్త్రం’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో కీలక పాత్ర పోషించిన నాగార్జున సౌత్ ఆడియన్స్ నే కాకుండా నార్త్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకోవడం విశేషం.

ఇక దసరాకి ది ఘోస్ట్ అంటూ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ది ఘోస్ట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దసరా సీజన్ కూడా ఈ సినిమాకి కలిసిరాలేదు. దీంతో నాగ్ ఫ్యాన్స్ బాగా డీలాపడ్డారు. దీంతో నాగార్జున నెక్ట్స్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ది ఘోస్ట్ తర్వాత మోహనరాజా డైరెక్షన్ లో మరో యాక్షన్ మూవీ చేయాలనుకున్నారు కానీ.. యాక్షన్ మూవీ అయిన ది ఘోస్ట్ ప్లాప్ అవ్వడంతో ఈసారి ఎంటర్ టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యారట. రైటర్ బెజవాడ ప్రసన్న నాగ్ కు కథ చెప్పడం.. ఆయన ఓకే అనడం జరిగింది.

అయితే.. ఈ మూవీకి దర్శకత్వం బాధ్యతలను మరొకరికి  ఇవ్వాలనుకున్నారు కానీ  చివరకు ప్రసన్నకే ఆ బాధ్యతలు అప్పగించాలని నాగ్ ఫిక్స్ అయ్యారు. గత కొన్ని రోజులు నుంచి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వర్క్ జరుగుతుంది. త్వరలో ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. నాగ్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో  నాగ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల బిగ్ బాస్ 6 సీజన్ కంప్లీట్ కావడంతో నాగ్ ఇప్పుడు సినిమాల పైనే ఫోకస్ పెడుతున్నారట. మరి.. జనవరిలో నాగ్ కొత్త సినిమాని ప్రకటిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్