Saturday, January 18, 2025
Homeసినిమామ‌హేష్ మూవీ సెట్స్ పైకి వ‌చ్చేది ఎప్పుడు..?

మ‌హేష్ మూవీ సెట్స్ పైకి వ‌చ్చేది ఎప్పుడు..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో మూవీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ  క్రేజీ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఆగ‌ష్టులో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంద‌ని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే.. ఆగ‌ష్టు 1 నుంచి షూటింగులు బంద్ అని ప్ర‌క‌టించ‌డంతో షూటింగ్ ఆల‌స్యం అవుతుందేమో అని టెన్ష‌న్ ప‌డుతున్నారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం సినీ పెద్దలు, నిర్మాతలు కృషి చేస్తున్నందున అతి త్వరలోనే అన్ని సమసిపోయి షూటింగ్స్ త్వరలో ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.

దానితో ఆ ప్రభావం మహేష్, త్రివిక్రమ్ ల మూవీ పై ఉండబోదని, ఈ భారీ ప్రాజక్ట్ ని ఆగష్టు 15, 16 తేదీల్లో లాంచ్ చేసేందుకు యూనిట్ రెడీ అయిందని టాక్. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయ‌డానికి ప్లాన్ చేశారు.

Also Read మ‌ళ్లీ వెండితెరపైకి ‘పోకిరి’

RELATED ARTICLES

Most Popular

న్యూస్