Saturday, November 23, 2024
HomeTrending Newsరైతాంగ సంక్షేమం కోసం నేతల డిమాండ్

రైతాంగ సంక్షేమం కోసం నేతల డిమాండ్

వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని దక్షిణ భారత రైతు సంఘం నాయకులు పిలుపు ఇచ్చారు. చెన్నై లో ఈ రోజు  సౌత్ ఇండియా రైతు నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతు సమస్యలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై నేతలు చర్చించారు. ఆ తర్వాత తమిళనాడు సచివాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తో సమావేశమైన సౌత్ ఇండియా రైతు సంఘం నాయకులు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో  అమలవుతున్న పథకాల సంబంధించిన విజ్ఞాపక పత్రాన్ని సీఎం స్టాలిన్ కు అందజేశారు. తమిళనాడులో కూడా రైతు బంధు, రైతు భీమా,వ్యవసాయ రంగంకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రం లో వ్యవసాయ పథకాలు అద్బుతంగా ఉన్నాయని ఈ సందర్భంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్రం లో అమలవుతున్న పథకాలను తమిళనాడు లో అమలు చేసేందుకు పరిశీలిస్తాం అని హామీ ఇచ్చిన సీఎం స్టాలిన్.

దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రైతు బంధు, రైతు భీమా వంటి కార్యక్రమాలు అమలు చేయాలని జాతీయ రైతు సంఘం ఉపాధ్యక్షుడు, పసుపు బోర్డ్ సాధన సమితి అధ్యక్షుడు నరసింహ నాయుడు డిమాండ్ చేశారు. వానాకాలంలో 7000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వరి దాన్యం ను కొనుగోలు చేయడం అంటే ఆషామాషీ కాదన్నారు.అన్ని రాష్ట్రాలు ఎమ్మెస్పీ పై కేంద్ర ప్రభుత్వం ను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు రైతులకు ఎంతో ఉపయోగమని, కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్ అని (కేరళ)రాష్ట్రీయ కిసాన్ మహా సంఘ్ కో ఆర్డినేటర్ పిటి జాన్  కొనియాడారు. ఈ సమావేశంలో కర్ణాటక సంయుక్త కిసాన్ మోర్చా అధ్యక్షుడు శాంతా కుమార్, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్