Thursday, January 23, 2025
Homeజాతీయంకిసాన్ మోర్చా ‘బ్లాక్ డే’

కిసాన్ మోర్చా ‘బ్లాక్ డే’

సంయుక్త్ కిసాన్ మోర్చా రేపు తలపెట్టిన బ్లాక్ డే కు 13 ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి. రైతు సంఘాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై మాజీ ప్రధాని దేవే గౌడ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపి అధినేత శరద్ పవార్,  సహా ముఖ్య మంత్రులు మమత బెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ థాకరే, హేమంత్ సోరెన్ సంతకాలు చేశారు. రైతు, కార్మిక, ప్రజా సంఘాలు కూడా ఈ నిరసనకు సంఘీభావం ప్రకటించాయి.

రైతు ఉద్యమం ప్రారంభమై 6  నెలలు అవుతున్న సందర్భంగా మార్చి 26న బ్లాక్ డే గా పాటించాలని సంయుక్త్ కిసాన్ మోర్చా పిలుపు ఇచ్చింది.  కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 3 వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతులు సుదీర్ఘ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. సాగు చట్టాలు వెనక్కు తీసుకోవాల్సిందే నని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 12సార్లు కేంద్రం చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. కోవిడ్ రెండో దశ నేపధ్యంలో తమ శిబిరాల్లోనే ఉంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్