Sunday, February 23, 2025
HomeTrending News10న సిఎంతో సినీ ప్రముఖుల భేటీ  

10న సిఎంతో సినీ ప్రముఖుల భేటీ  

CM-Film Industry: మెగాస్టార్ చిరంజీవి ఈ గురువారం మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సమావేశం కానున్నారు. జనవరి 13న జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ ఉంటుంది. సిఎంతో ఏయే అంశాలు చర్చించాలనే అంశంపై సినీ రంగానికి చెందిన ప్రముఖులతో చిరంజీవి రేపు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో సమావేశం కానున్నారు.

ఈసారి చిరంజీవితో పాటుగా మరో ఐదుగురు సినీ ప్రముఖులు కూడా సిఎం ను కలవనున్నారు. సిఎంతో భేటీకి ఎవరెవరు వెళ్ళాలనే దానిపై కూడా రేపు నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం భేటీకి వస్తున్నవారి పేర్లని సిఎంవోకు పంపుతారు. 10వ తేదీ జరగబోయే సమావేశం కూడా సమావేశం లంచ్ మీటింగ్ గా ఉంటుందని భావిస్తున్నారు.  చిరంజీవి ఈరోజే సినీ ప్రముఖులు, పెద్దలతో సమావేశం కావాల్సి ఉంది, అయితే పలువురు అందుబాటులో లేని కారణంగా రేపు ఈ భేటీ నిర్వహిస్తున్నారు.

Also Read : త్వరలోనే సానుకూల నిర్ణయం : చిరంజీవి

RELATED ARTICLES

Most Popular

న్యూస్