Monday, January 20, 2025
HomeTrending Newsర‌ష్యా కేఫ్‌లో అగ్నిప్ర‌మాదం.. 15 మంది మృతి

ర‌ష్యా కేఫ్‌లో అగ్నిప్ర‌మాదం.. 15 మంది మృతి

ర‌ష్యా కేఫ్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో 15 మంది మృతి చెందారు. కోస్ట్రోమా న‌గ‌రంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం 15 మంది మృతిచెందిన‌ట్లు స్థానిక గ‌వ‌ర్న‌ర్ సెర్గీ సిట్నికోవా తెలిపారు. అగ్నిప్ర‌మాదం జ‌రిగిన బిల్డింగ్ నుంచి 250 మందిని సుర‌క్షితంగా త‌ర‌లించారు. రాత్రిపూట పోలిగాన్ అనే కేఫ్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలిపారు. తెల్ల‌వారుజామున జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో అయిదు మంది గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదం వ‌ల్ల కేఫ్‌కు ఉన్న రూఫ్ కూలిన‌ట్లు తెలుస్తోంది.

రష్యా రాజధాని మాస్కో కు ఈశాన్యంలో 340 కిలోమీటర్ల దూరంలో క్రోస్తోమా నగరం ఉంది. ఉవ్వెత్తున లేచిన మంటలకు కేఫ్ మొత్తం అగ్నకి ఆహుతైంది. ప్రమాదం ఎలా జరిగింది తెలియ రాలేదు. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్