Sunday, January 19, 2025
Homeసినిమాప్రభాస్, మారుతి మూవీ లుక్ అదిరింది

ప్రభాస్, మారుతి మూవీ లుక్ అదిరింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆదిపురుష్‌ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సలార్ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే ప్రాజెక్ట్ కే మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలతో పాటు ప్రభాస్.. మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. బాహుబలి తర్వాత ప్రభాస్ ఆ రేంజ్ సక్సెస్ సాధించలేదు. దీంతో ప్రభాస్ ఎప్పుడెప్పుడు భారీ బ్లాక్ బస్టర్ సాధిస్తాడా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే.. మారుతితో సినిమా అనగానే అభిమానులు చేయద్దు అన్నారు. అయినప్పటికీ మారుతి చెప్పిన కథ పై వున్న నమ్మకంతో తనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా సైలెంట్ గా షూటింగ్ ని కూడా మొదలు పెట్టేశాడు ప్రభాస్. రాజా డీలక్స్ అనే టైటిల్ ఈ మూవీకి ప్రచారంలో వుంది. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మూవీలో మూడవ నాయికగా రిద్ది కుమార్ కూడా కనిపించబోతోంది. ఓ పురాతన థిమేటర్ నేపథ్యంలో సాగే హారర్ థ్రిల్లర్ గా ఈ మూవీని మారుతి తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.

ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. తాజాగా ఈ మూవీ ఆన్ లొకేషన్ కి సంబంధించిన  ప్రభాస్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. గత చిత్రాలకు పూర్తి భిన్నమైన మేకోవర్ తో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్న తీరు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ లుక్ ని చూసిన ఫ్యాన్స్ కొంత వరకు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ ని మేకర్స్ ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు. మరి.. ప్రభాస్ ని మారుతి ఎలా చూపిస్తారో..? ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్