Sunday, January 19, 2025
Homeసినిమామెగాస్టార్ ‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ ‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

first Bhola: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ చిత్రం ‘భోళా శంకర్’. ప్రముఖ నిర్మాణ సంస్థలు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ పై రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాణంలో అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను మహా శివరాత్రి సందర్భంగా మార్చి 1న ఉద‌యం 9 గంట‌ల 5 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.
ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టిస్తున్నారు. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. డూడ్లే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌ల కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. శ‌ర‌వేగంగా షూటిగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్