Sunday, May 11, 2025
Homeసినిమా 'బేబీ' నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్

 ‘బేబీ’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్

హీరో ఆనంద్ దేవరకొండ ,విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా ‘బేబీ‘. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకం పై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల నేషనల్ అవార్డ్ అందుకున్న సాయి రాజేష్ తదుపరి చిత్రం కావడం సినిమాకు ప్లస్. రీసెంట్ గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.

తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాటను విడుదల చేశారు. తొలి ప్రేమంత స్వచ్ఛంగా సాగిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా.. విజయ్ బుల్గానిన్ స్వరపర్చారు. శ్రీరామ్ ఆలపించారు. బ్యూటిఫుల్ లవ్ సాంగ్ గా ఓ రెండు మేఘాలిలా శ్రోతలను ఆకట్టుకుంటోంది. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్