Sunday, January 19, 2025
HomeTrending Newsనాగార్జున సాగర్‌కు 1.75లక్షల క్యూసెక్కుల వరద

నాగార్జున సాగర్‌కు 1.75లక్షల క్యూసెక్కుల వరద

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు పరీవాహక ప్రాంతాల నుంచి ప్రస్తుతం జలాశయానికి 1,75,272లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం నుంచి 31,849 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 580 అడుగుల మేర నీరున్నది. డ్యామ్‌ గరిష్ఠ నిల్వసామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 283.01.60 టీఎంసీల మేర నిల్వ ఉన్నది. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 25,818 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువలకు 2570 క్యూసెక్కుల చొప్పున నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్