Sunday, November 24, 2024
HomeTrending Newsకడెం ప్రాజెక్ట్ కు భారీ వరద... భయం గుప్పిట్లో లోతట్టు ప్రాంతాలు

కడెం ప్రాజెక్ట్ కు భారీ వరద… భయం గుప్పిట్లో లోతట్టు ప్రాంతాలు

భారీ వర్షాలకు నిర్మ‌ల్ జిల్లాలో నదులకు వరద పోటెత్తుతుంది. న‌దులు, వాగులు, వంక‌లు ఉప్పొంగుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, గ‌డ్డెన్న‌ స్వ‌ర్ణ ప్రాజెక్ట్ ల‌లోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుంది. మ‌రోవైపు సీయం కేసీఆర్ ఆదేశాల మేర‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నిర్మ‌ల్ జిల్లాలో ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్యవేక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగం, ప్ర‌జాప్ర‌తినిదుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ… స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ.. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తున్నారు. స్వ‌ర్ణ ప్రాజెక్ట్ లో భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుండ‌టంతో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్వ‌ర్ణ ప్రాజెక్ట్ ను సంద‌ర్శించి.. ఇన్ ప్లో, అవుట్ ప్లో వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షాల వల్ల చెరువులు ఇప్పటికే 70 శాతానికి పైగా నిండాయన్నారు. ఎస్సారెస్పీతో పాటు క‌డెం, స్వ‌ర్ణ‌, గ‌డ్డెన్న ప్రాజెక్ట్ లోకి భారీ వరదలు వస్తుండటం వల్ల ముందే గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామ‌ని తెలిపారు. ఆయా ప్రాజెక్ట్ ల పరివాహక ప్రాంత పరిధిలోని గ్రామాల ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జిల్లాలో వరదల సందర్భంగా ఎలాంటి విప‌త్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉంద‌ని పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనులు చేపట్టడంవల్ల ఎక్కువ నష్టం జరగకుండా చూశామన్నారు. నీటిపారుద‌ల‌, రెవెన్యూ, పోలీస్ శాఖ‌ల‌తో పాటు ఇత‌ర శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని సూచించారు. ప్ర‌జాప్ర‌తినిదులంద‌రూ స్థానికంగా ఉంటూ.. గ్రామాల్లో ప‌రిస్థితిని ఎప్ప‌టికప్పుడు ప‌ర్య‌వేక్షించాల‌ని చెప్పారు.

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెంట క‌లెక్ట‌ర్ ముశ్ర‌ఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, నీటిపారుద శాఖ ఈఈ రామారావు, ఇత‌ర అధికారులు, ప్ర‌జాప్ర‌తినిదులు ఉన్నారు.

కడం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ కి వచ్చి చేరుతున్న భారీ వరదతో ఏ క్షణంలోనైనా డ్యామ్ పై నుండి నీరు పారే అవకాశం ఉందన్నారు. 25 గ్రామాలకు సైరన్. భయం గుప్పిట్లో కడం గ్రామ ప్రజలు. ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారని, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి విషయాలు తెలుసుకుని సూచనలు చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. విషయం తెలియగానే హుటాహుటిన నిర్మల్ నుండి కడం ప్రాజెక్టుకు బయలుదేరిన మంత్రి. వరదలతో నిర్మల్- మంచిర్యాల రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ఆర్మూర్, మెట్ పెల్లి, జగిత్యాల మీదుగా ప్రయాణం చేపట్టాలని అధికారులు సూచించారు.

ఎస్సారెస్పీకి పోటెత్తుతున్న వరద.

2,45,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో….34 గేట్లు ఎత్తి 2,00,850, క్యూసెక్కుల నీట్ విడుదల. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్ద్యం 90 టీఎంసీలు, ప్రస్తుతం 74 టీఎంసీలు. పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు కాగా ప్రస్తుతం 1087 అడుగులు ఉంది. జెన్ కో కి 2500 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 10000 క్యూసెక్జుల నీటి విడుదల.

RELATED ARTICLES

Most Popular

న్యూస్