Sunday, January 19, 2025
HomeTrending Newsమాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత

మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత

Minister Fareeduddin Dies :

జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ బుధవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యంతో ఇటీవలే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సహా ప్రజా సంఘాల నేతలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. గ్రామ సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ.. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం కూడా పూర్తి అయ్యింది.

మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఫరీదుద్ధీన్ ఎమ్మెల్యేగా, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా,ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విశేష సేవలందించారని, మైనారిటీ నేతగా, ప్రజాప్రతినిధిగా వారు చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. హైదారాబాద్ ఏ ఐ జి ఆసుపత్రిలో మాజీ మంత్రి ఫరీదుద్దీన్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన మంత్రులు శ్రీ హరీష్ రావు, శ్రీ మహమూద్ ఆలీ తదితరులు.

మాజీ మంత్రి వర్యులు ఫరిదొద్ధిన్ పార్థివ దేహం ఉదయం 10 గంటలకు జహీరాబాద్ పట్టణం లోని బాగారెడ్డి స్టేడియం వద్దకు చేరుకుంటుంది. అభిమానులు,కార్యకర్తల సందర్శనార్థం ఉంచి సాయంత్రం 3 గంటల తరవాత జహీరాబాద్ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం 4 గంటలకు ఆయన స్వగ్రామం హోతి లోని వ్యవసాయ క్షేత్రం వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్