గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థానంలో ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీనిపై వ్యాపారులు కోర్టును ఆశ్రయించటంతో వివాదం కొనసాగుతోంది.తాత్కాలికంగా బాటసింగారం కు మార్కెట్ తరలింపు విషయంలో పునరాలోచన చేయాలని శాసనసభలో ప్రభుత్వానికి ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి. సాధ్యాసాధ్యాలను పరిశీలించి , చర్చించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
మంత్రుల నివాస సముదాయంలోని హోంమంత్రి నివాసంలోఆదివారం జరిగిన సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి, హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, అక్బర్ బిన్ అబ్దుల్లా బలాలా పాల్గొన్నారు. తాత్కాలిక పండ్ల మార్కెట్ నిర్వహణకు అనువైన స్థలాల పరిశీలనకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
తాత్కాలికంగా బాటసింగారంకు బదులుగా కొత్తపేట విక్టరీ ప్లే గ్రౌండ్ (వీఎంహోం) లో కొనసాగించేందుకు పరిశీలించాలని ఎంఐఎం ఎమ్మెల్యేల వినతి. బాటసింగారంలో అన్ని వసతులు కల్పించినట్లు మార్కెటింగ్ అధికారుల వెల్లడించారు. కోహెడలో మౌళిక సదుపాయాలు కల్పించే వరకు బాటసింగారంలో కొనసాగిస్తామని ప్రతిపాదన. విక్టోరియా ప్లే గ్రౌండ్ తో పాటు, తాత్కాలికంగా బాటసింగారంలోని లాజిస్టిక్ పార్క్ రెండు స్థలాలను పండ్ల మార్కెట్ నిర్వహణకు పరిశీలించాలని సమావేశంలో నిర్ణయం. ఈ ఉదయం ఎంఐఎం ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, అక్బర్ బిన్ అబ్దుల్లా బలాలా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డిలతో పాటు మార్కెట్ ప్రతినిధులతో కలిసి బాటసింగారం లాజిస్టిక్ పార్క్, విక్టోరియా ప్లే గ్రౌండ్ స్థలాలను పరిశీలించనున్న హోంమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం.