Sunday, January 19, 2025
Homeసినిమాగాలి జనార్ధన్ రెడ్డి కొడుకు తో వారాహి 15వ మూవీ

గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు తో వారాహి 15వ మూవీ

Kireeti debut: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం, హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లతో పాటు కంటెంట్ ఆధారిత సినిమాలను రూపొందిస్తుంటుంది. ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంతో కిరీటిని హీరోగా పరిచయం చేయనుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం భారీ స్థాయిలో నిర్మించబడుతుంది. ఈ చిత్రం కిరీటికి గుడ్‌ లాంచ్ కానుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు నటించనున్నారు. మైనింగ్గా డాన్ గా పేరు సంపాదించి కేసుల్లో ఇరుక్కొని రాజకీయంగా కూడా దెబ్బతిన్న కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి.

విభిన్న క్రాఫ్ట్‌లను నిర్వహించడానికి మేకర్స్ అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులను కూడా ఎంచుకున్నారు. సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, బాహుబలి లెన్స్‌మెన్ కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్, భారతదేశపు టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రాఫ్ చేస్తారు. మార్చి 4న ఈ సినిమా గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ జరగనుంది. ఇతర వివరాలు త్వరలో ప్ర‌క‌టించ‌నున్నారు.

Also Read : మెగా మాస్ మేనియా.. ‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్