Sunday, May 19, 2024
HomeTrending Newsరాజకీయాలకు గుడ్ బై... తాత్కాలికంగానే...: గల్లా జయదేవ్

రాజకీయాలకు గుడ్ బై… తాత్కాలికంగానే…: గల్లా జయదేవ్

రాజకీయాలనుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్లు తెలుగుదేశం పార్టీ నేత, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ‘రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా కానీ టీడీపీ నుంచి కాదు, వివిధ కేసుల్లో ఈడీ నన్ను రెండు సార్లు పిలిచి విచారించింది, నా వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయి. సీబీఐ, ఈడీ నా ఫోన్‌లు ట్యాప్‌ చేస్తున్నాయి’ అన్నారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో జయదేవ్ ఈ నిర్ణయం ప్రకటించారు. వీలైతే రాజకీయాలు తాను మారుస్తానని, కానీ రాజకీయాలు తనను మార్చలేవని ఇదే నమ్మకంతో తాను ఈ రంగంలోకి వచ్చానన్నారు. రాజకీయాల్లో రాకముందు తనకు ఎలాంటి బలాలు ఉన్నాయో అవి ఈ రంగంలోకి వచ్చిన తరువాత తన బహీనతలుగా మారాయన్నారు.

వనవాసం తరువాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా కొద్దికాలం విరామం తర్వాత తాను తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలగడంలేదని స్పష్టం చేశారు. గుంటూరు లో నాకు గ్రూప్ రాజకీయాలు లేవన్నారు. గత ప్రభుత్వం నుంచి తాము బైటకు వచ్చినప్పుడు అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలు కోసం పార్లమెంట్ లో తన గళాన్ని గట్టిగా వినిపించానని, దీన్ని దృష్టిలో ఉంచుకునే తనపై ఈడీ తనపై విచారణ మొదలు పెట్టిందని అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయాలు-వ్యాపారాలు రెంటినీ సమన్వయం చేసుకోలేకపోతున్నానని అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.  ఇండియా మ్యాప్ లో అమరావతి ని రాజధానిగా పెట్టించడంలో కృషి చేశానన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్