Saturday, January 18, 2025
HomeసినిమాGame Changer: 'గేమ్ ఛేంజర్' మళ్లీ ఆగిందా..?

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ మళ్లీ ఆగిందా..?

రామ్ చరణ్‌, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఇందులో చరణ్ కు జంటగా కైరా అద్వానీ నటిస్తుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చరణ్ కు 15వ చిత్రం కాగా, దిల్ రాజుకు 50వ చిత్రం కావడం విశేషం. శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తుంటే.. ఎస్.జె.సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభమై దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది.

ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంది. ఆతర్వాత ఇండియన్ 2 షూటింగ్ చేయాల్సిరావడంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ కి బ్రేక్ పడింది. తాజా షెడ్యూల్ లో రామ్ చరణ్‌ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఈ నెలలో హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ కి ఏర్పాట్లు చేశారు. అయితే.. ఇప్పుడు ఈ తాజా షెడ్యూల్ ఆగిపోయింది. ఈ విషయాన్ని మేకర్స్ అపిషియల్ గా అనౌన్స్ చేశారు. కొంత మంది ఆర్టిస్టులు అందుబాటులో లేకపోవడంతో సెప్టెంబర్ షెడ్యూల్ వాయిదా వేశాం. అక్టోబర్ సెకండ్ వీక్ లో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేస్తామని తెలియచేశారు.

ఈ చిత్రాన్ని నెక్ట్స్ ఇయర్ ఆగష్టు 15కి విడుదల చేయాలని కూడా అనుకున్నారు. పుష్ప 2 ఆగష్టు 15న వస్తుండడంతో అంతకంటే ముందే ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. డైరెక్టర్ శంకరే తీసుకోవాలని దిల్ రాజు ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ బిజీలో ఉన్న శంకర్ త్వరలో గేమ్ ఛేంజర్ పై క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్