Tuesday, February 25, 2025
HomeTrending Newsపదో తరగతి అమ్మాయిపై తోటి విద్యార్థుల గ్యాంగ్‎రేప్

పదో తరగతి అమ్మాయిపై తోటి విద్యార్థుల గ్యాంగ్‎రేప్

హైదరాబాద్‎లో దారుణ ఘటన జరిగింది. పదో తరగతి అమ్మాయిపై ఆమె తోటి విద్యార్థులు గ్యాంగ్‎రేప్‎కు పాల్పడ్డారు. ఈ ఘటన హయత్‎నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన ఓ అమ్మాయి పదో తరగతి చదువుతోంది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో.. ఆమెతో పాటు చదువుతున్న విద్యార్థులు ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం బెదిరించి, అందరూ అత్యాచారం చేశారు. ఈ ఘటనను మొత్తం ఓ విద్యార్థి వీడియో తీశాడు. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. పది రోజుల తర్వాత మరోసారి వీడియో చూపించి, బెదిరించి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈసారి కూడా వీడియో తీసి, తమ స్నేహితులకు పంపించారు. దాంతో స్కూళ్లో బాధితురాలి వీడియోలు వైరల్ కావడంతో.. తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే బాధతురాలి తల్లిదండ్రులు.. హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్