Thursday, May 9, 2024
HomeTrending NewsTammineni Sitaram: మూడే శాశ్వత పరిష్కారం: తమ్మినేని

Tammineni Sitaram: మూడే శాశ్వత పరిష్కారం: తమ్మినేని

ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మరో వ్యవస్థను గౌరవించుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. తామే గొప్ప అనుకుంటే ప్రజల్లో పలుచన అవుతామని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధానిపై సుప్రీం కోర్టు తీర్పుపై తమ్మినేని స్పందించారు.  ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంటే విపక్షాలు ప్రజలను రెచ్చగొట్టి ఓ కృత్రిమ ఉద్యమాన్ని నడిపాయని ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్మినేని… నిన్నటి తీర్పుపై తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని జనసేన, తెలుగుదేశం పార్టీలను డిమాండ్ చేశారు.  వికేంద్రీకరణపై న్యాయస్థానం తీర్పు చాలా స్పష్టంగా ఉందని, ఇది న్యాయ వ్యవష్టపై నమకం కలిగించేలా ఉండని పేర్కొన్నారు. శాసన సభ చట్టాలు చేయవద్దంటే ఎలా అని ప్రశ్నించారు.

రాజధాని అనేది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మనోభావాలకు సంబంధించిన విషయమని, రాష్ట్రాభి వృద్ధి కోరుకునేవారు మూడు రాజధానులకు సహకరించాలని, భవిష్యత్తులో ప్రాంతాల మధ్య వైషమ్యాలు రాకుండా ఉండడానికి ఇదే శాశ్వత పరిష్కారమని  సీతారాం సూచించారు.

Also Read : Supreme Court: అమరావతి రాజధానిపై సుప్రీం పాక్షిక స్టే 

RELATED ARTICLES

Most Popular

న్యూస్