Sunday, January 19, 2025
Homeసినిమాబాబాయ్ తేదీలపై అబ్బాయ్ కన్ను!

బాబాయ్ తేదీలపై అబ్బాయ్ కన్ను!

Babai-Abbai: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘గ‌ని’. ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లేటెస్ట్‌గా మారుతున్న ప‌రిస్థితుల దృష్ట్యా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. గ‌ని మూవీని ఫిబ్ర‌వ‌రి 25 లేదా మార్చి 4న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యేమంటే… భీమ్లా నాయ‌క్ రిలీజ్ డేట్ ఫిబ్ర‌వ‌రి 25నే ఈ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫిబ్ర‌వ‌రి 25కి రాక‌పోతే అదే రోజున అబ్బాయ్ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన గ‌ని మూవీ వ‌స్తుంద‌న్న‌మాట‌. లేకుంటే మార్చి 4న వ‌రుణ్ తేజ్ గ‌ని థియేట‌ర్స్‌ లో సంద‌డి చేస్తుంద‌న్న‌మాట. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

గ‌ని సినిమా కోసం వ‌రుణ్ తేజ్ బాక్స‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డ్డారు. సిక్స్ ప్యాక్ పెంచారు. బాక్సింగ్‌ ప్రొఫెష‌న‌ల్‌గా క‌నిపించాల‌నే ఉద్దేశంతో అమెరికాకు వెళ్లి మ‌రీ ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను తీసుకున్నారు. హాలీవుడ్ చిత్రం టైటాన్స్‌, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ ఈ చిత్రానికి యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేయ‌డం విశేషం. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ సినిమా కోసం స్పెష‌ల్ సాంగ్‌లో న‌ర్తించింది.

Also Read :  ‘గని’ డబ్బింగ్ పూర్తి చేసిన వరుణ్ తేజ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్