Monday, June 17, 2024
Homeసినిమాగీతాంజలి ఈసారి భయపెట్టలేకపోయింది! 

గీతాంజలి ఈసారి భయపెట్టలేకపోయింది! 

అంజలి  ప్రధానమైన పాత్రను పోషించిన ‘గీతాంజలి’ కొంతకాలం క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ కామెడీ జోనర్లో ఈ సినిమా పలకరించింది. తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మించారు. అయినా అంజలి పాత్ర నుంచి హారర్ .. బ్రహ్మానందం – శ్రీనివాస రెడ్డి పాత్రల నుంచి కామెడీ .. రావు రమేష్ పాత్ర వైపు నుంచి విలనిజం గొప్పగా వర్కౌట్ అయింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ని రూపొందించారు. శివ తుర్లపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది.

‘గీతాంజలి’ సినిమా వచ్చి చాలాకాలమే అయినా, ఆ సినిమాను చాలామంది ఇంకా మరిచిపోలేదు. అందువలన సీక్వెల్ పై అందరిలో ఆసక్తి పెరుగుతూ వెళ్లింది. ఫస్టు పార్టు కథను టైటిల్స్ సమయంలోనే గుర్తుచేస్తూ, టైటిల్స్ పూర్తికాగానే సీక్వెల్ కథలోకి తీసుకుని వెళ్లారు. ఇది దెయ్యలతో ముడిపడిన కథ అనే విషయం ఆడియన్స్ కి ముందుగానే తెలుసు. అలాగే శ్రీనివాస రెడ్డి బ్యాచ్ వైపు నుంచి కామెడీ ఉంటుందని తెలుసు. ఆ తతంగం ఎలా జరుగుతుందనేది చూడటానికి ఆడియన్స్ రెడీయైపోతారు.

‘గీతాంజలి’ సినిమాలో కథ అంతా కూడా ఒక ఫ్లాట్ లో జరుగుతుంది. ఈ సారి కథను ‘సంగీత్ మహల్’ పేరుతో పాత బంగ్లాకి షిఫ్ట్ చేశారు. పాత్రలన్నీ అక్కడికే చేరతాయి .. అక్కడే హడావిడి చేస్తాయి. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను నవ్వించిందా? భయపెట్టిందా? అంటే, ఆ రెండింటికీ న్యాయం చేయలేక మధ్యలో ఉండిపోయిందని చెప్పాలి. ఫస్టు పార్టులో ఏ అంశాలైతే కథకి బలంగా నిలిచాయో, సీక్వెల్ లో ఆ అంశాలు బలహీనంగా కనిపిస్తాయి. అందువలన ఆడియన్స్ కథలోకి వెళ్లలేక, కామ్ గా సీట్లో కూర్చుండిపోతారంతే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్