Sunday, February 23, 2025
Homeస్పోర్ట్స్మహిళల హాకీ: ఇండియాపై జర్మనీ విజయం

మహిళల హాకీ: ఇండియాపై జర్మనీ విజయం

Women’s FIH Pro League : 2021-22 మహిళల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో  ఇండియాపై జర్మనీ షూటౌట్ విజయం సాధించింది. ఓడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 4వ నిమిషంలోనే ఇండియా  క్రీడాకారిణి నవనీత్ కౌర్ ఫీల్డ్ గోల్ చేసింది. ఆ వెంటనే జర్మనీకి చెందిన సిప్పెల్ కర్లోట్టా పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ చేసి స్కోరు సమం చేసింది. ఆ తర్వాత మ్యాచ్ సమయం ముగిసే వరకూ రెండు జట్లూ గోల్ చేయలేకపోయాయి. దీనితో షూటౌట్ సమయంలో ఇండియా ఒక గోల్ చేయగా, జర్మనీ రెండో గోల్స్ చేయడంతో2-1 తేడాతో విజయం వరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్