Saturday, January 18, 2025
HomeTrending Newsజీవో 217పై దుష్ప్రచారం సరికాదు

జీవో 217పై దుష్ప్రచారం సరికాదు

GO 217: మత్స్యకారుల అభ్యున్నతి కోసమే జీవో 217 తీసుకువచ్చామని, దీనిపై దుష్ప్రచారం తగదని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు అన్నారు. వంద హెక్టార్ల కంటే ఎక్కువున్న 582 చెరువులకే జీవో వర్తిస్తుందని, వీటిలో 337 చెరువుల్లో 255 మత్స్యకార సంఘాలు చేపలు పడుతున్నాయని, నెల్లూరులోని 27 చెరువుల్లో పైలట్ ప్రాజెక్టు కింద జీవో అమలు చేస్తున్నామని, మిగతా 310 చెరువుల్లో ఇంకా జీవో అమలు చేయడం లేదని, నెల్లూరులో విజయవంతమైతే మిగతా చోట్లకు విస్తరించాలని నిర్ణయించామని చెప్పారు.  వివరించారు. ఇవి కాక మిగిలిన 27,360 చెరువుల్లో మత్స్య సంపద పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు.

మత్స్యకార సంఘాలకు మరింత ఆదాయం వచ్చేందుకే ఈ జీవో అమలు చేస్తున్నామని, దళారుల దందాపై అధ్యయనం చేసి ఈ తరహా నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 100 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులకు ఈ జీవో వర్తించదనే విషయాన్ని గుర్తించాలని సూచించారు.

రాష్ట్రంలోమొత్తం రూ.3,177 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తామని.. ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తి చేస్తామని వివరించారు. ప్రస్తుతం 4 ఫిషింగ్ హార్బర్ల పనులు మొదలయ్యాయని.. మిగతా 5 ఫిషింగ్ హార్బర్లూ టెండర్ల దశలో ఉన్నాయని పేర్కొన్నారు. మత్స్య ఎగుమతులను దేశీయంగా మరింత పెంచేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. రీటైల్ అవుట్‌లెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని.. రోడ్డు పక్కన అమ్ముకునే వారికి సౌలభ్యం కలిగించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.

Also Read : మా ప్రభుత్వం రాగానే 217 జీవో రద్దు: పవన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్