కరోన నేపథ్యంలో ఇతర దేశాల పౌరుల రాకపోకలపై నిషేధం విధించిన యుకె ప్రభుత్వం క్రమంగా నిభందనలు సడలిస్తోంది. తాజాగా భారత దేశాన్ని రెడ్ లిస్టు నుంచి అంబర్ లిస్టుకు మార్చింది. దీని ప్రకారం యుకె గుర్తించిన వ్యాక్సిన్ వేయించుకున్న వారు రావచ్చు. ప్రయాణానికి మూడు రోజుల ముందు కరోన టెస్ట్ చేయించుకుని ఉండాలి. ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత పది రోజుల క్వారంటైన్ ఉండాలి.
ఇంగ్లాండ్ కొత్త నిభందనలు ఈ నెల ఎనిమిదవ తేది నుంచి అమలులోకి వస్తాయి. అయితే ఇది వరకే యుకెలో వ్యాక్సిన్ వేయించుకున్న వారికి తాజా నిభంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. ఏప్రిల్ నుంచి నిషేధం అమలులోకి రావటంతో అనేక భారతీయ కుటుంబాలు ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. ఉన్నత చదువుల కోసం వెళ్ళే విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.