శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సతో భారత ప్రతినిధి బృందం ఈ రోజు సమావేశం అయింది. శ్రీలంకను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే మార్గాలపై భారత బృందంతో రాజపక్స చర్చించారు. సిలోన్ ను ఆదుకునేందుకు భారత్ సంసిద్దంగా ఉందని ఈ సందర్భంగా భారత బృందం రాజపక్సకు స్పష్టం చేసింది. పొరుగు దేశంగా అన్ని విధాల అండగా ఉంటామని, ఆర్థికంగా, దౌత్య పరంగా శ్రీలంకను గాడిలో పెట్టేందుకు తమ వంతు అండగా ఉంటామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతేక సందేశాన్ని రాజపక్సకు భారత బృందం అందించింది.
అనూహ్య ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఆర్థిక పరిస్థితిని, మరో విడత ఆర్థిక సహాయాన్ని అందచేయాల్సిన అవసరాన్ని అంచనా వేసేందుకు ముఖ్య అర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ సారథ్యంలో భారతీయ ప్రభుత్వ ప్రతినిధి బృందం గురువారం(జూన్ 23) శ్రీలంక రాజధాని కొలంబో చేరుకుంది. మూడు గంటల పాటు ఇక్కడ గడపనున్న ఈ ప్రతినిధి బృందం శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని విక్రమసింఘెతో సమావేశమై చర్చలు జరపనున్నది. ఈ నెల 20వ తేదిన న్యూఢిల్లీలోని శ్రీలంక రాయబారి మిలింద మొరగొడ భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిపిన చర్చలకు స్పందనగా భారత ప్రతినిధి బృందం కొలంబో సందర్శించింది.
Also Read : రాజపక్సకు గుణపాఠం- తమిళ ఈళం సానుభూతిపరులు