47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను నియామక వివరాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం ఊసే లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజ్యసభ సీటు విషయంలో బాబు ఎస్సీలను అవమానించారని, చంద్రబాబు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంక్‌గానే చూశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా డైరెక్టర్ల నియమకంలోనూ పాల్గొని అన్ని వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. సామాజిక న్యాయం కార్పొరేషన్ల స్థాయిలో అమలయ్యే విధంగా తయారు చేశారన్నారు.
ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు ఇచ్చామన్నారు. మహిళలకు 52 శాతం అవకాశం కల్పించామన్నారు. ఓసీలకు 42 శాతం పదలిచ్చామని తెలిపారు. బలహీన వర్గాలను ముందుకు తీసుకురావడమే సీఎం జగన్ లక్ష్యమని సజ్జల అన్నారు