Monday, January 20, 2025
HomeTrending Newsఇళ్ళ నిర్మాణానికి లక్షా ఐదు వేల కోట్ల ఖర్చు: సిఎం

ఇళ్ళ నిర్మాణానికి లక్షా ఐదు వేల కోట్ల ఖర్చు: సిఎం

సొంత ఇల్లు అనేది పేదవాడి కల అని, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు.  ఈ-ల్యాబులను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించి, పేదవాడికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలని సూచించారు.  లే అవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత, వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలని కోరారు. లే అవుట్లు పూర్తవుతున్న కొద్దీ మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకుసాగాలని సూచించారు.

గృహనిర్మాణశాఖపై క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు.  పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై ముఖ్యమత్రి ఆరా తీశారు. వర్షాలు తగ్గిన తర్వాత డిసెంబరు నుంచి ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, స్టేజ్‌ కన్వెర్షన్‌ కూడా బాగా జరిగిందని, ఇళ్లనిర్మాణాల్లో నాణ్యతను పరీక్షించేందుకు మొత్తంగా 36 ల్యాబులు ఏర్పాటు చేశామని అధికారులు వివరణ ఇచ్చారు.  ఎక్కడ లోపం వచ్చినా.. వెంటనే గుర్తించి.. నాణ్యతను పెంచుకునేందుకు ల్యాబులు వినియోగపడుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పూర్తయిన ఇళ్లకు 15 రోజుల్లోగా విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తున్నమని ట్రాన్స్‌ కో అధికారులు చెప్పారు.

మూడున్నరేళ్లలో పేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరగని విధంగా ఖర్చు చేశామని,  పేదలంరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, కార్యక్రమం విలువ మొత్తం రూ.1,05,886.61 కోట్లు అని సమావేశంలో లెక్కలు తేల్చారు.

టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష

టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం గణనీయంగా సహాయం అందించిందని, ఈ మూడున్నర సంవత్సరాలలో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఉచితంగా 300 అడుగులు ఇళ్లు, మిగిలిన కేటగిరీల లబ్ధిదారులకు తమవంతుగా చెల్లించిన వాటిపై  సబ్సిడీ ఇవ్వడంతో పాటు, ఉచితంగా రిజిస్ట్రేషన్లు  చేసిందని సిఎం అన్నారు.

టిడ్కో ఇళ్ల కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.8015 కోట్లు అయితే ఈ ప్రభుత్వం చేసిన ఖర్చు, పేదలకు కల్పించిన ప్రయోజనాలు విలువ చూస్తే మొత్తంగా రూ.20,745 కోట్లని సిఎం తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్