Wednesday, February 26, 2025
Homeతెలంగాణ200 కాన్సెంట్రేటర్లు ఇచ్చిన గ్రీన్ కో

200 కాన్సెంట్రేటర్లు ఇచ్చిన గ్రీన్ కో

గ్రీన్ కో సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. చైనా నుంచి శంషాబాద్ కు ప్రత్యేకంగా విమానంలో వచ్చిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలను మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమక్షంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి అందజేశారు.

కోవిడ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచేందుకు ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందించినందుకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

కరోనా కట్టడికి ఎలాంటి నిధుల కొరత లేదని, అయితే ఇప్పుడు అత్యవసరమైన ఆక్సిజన్ అందించే కాన్సెంట్రేటర్లలను చైనా నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఇవ్వడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్