What we can: రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని, నిజాయితీగా ఏది చేయగలుగుతామో అదే చెబుతున్నామని, ఏది చెబుతున్నామో అదే చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నీళ్లు, విద్యుత్, రోడ్లు, రైల్వేలైన్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఎవ్వరికీ కూడా మోసం చేసే మాటలు చెప్పడంలేదని స్పష్టం చేశారు. తాము చేసే పనుల్లో నిజాయితీ ఉంది కాబట్టి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి వస్తున్నారని వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పరిశ్రమలు, పోర్టులు, ఫిషింగ్ హార్భర్లపై సిఎం జగన్ సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు
⦿ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి
⦿ భజాంకాలు, బంగర్లు, సింఘ్వీలు, బిర్లాలు లాంటి వారంతా రాష్ట్రానికి వస్తున్నారు
⦿ అదానీకూడా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు
⦿ తమ ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధితో అడుగులు ముందుకేస్తున్నారు, కారణం మనం చేయగలిగినదే చెప్తున్నాం
⦿ పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
⦿ దీనివల్ల వీలైనంత త్వరగా పరిశ్రమలు తమ పనులను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుంది
⦿ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా పెద్ద మొత్తంలో ఉపాధి లభించనుంది, వీటిపై ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి
⦿ దాదాపు 66వేల ఎకరాలకుపైగా భూమిని ఈ ప్రాజెక్టులకు వినియోగించాల్సి ఉంటుంది
⦿ అర హెక్టార్ కన్నా తక్కువ భూమి ఉన్న జనాభా రాష్ట్రంలో 50 శాతం ఉండగా… ఒక హెక్టర్ కంటే తక్కువ భూమి ఉన్నవారు 70 శాతం ఉన్నారు
⦿ ఈ ప్రాజెక్టుల ద్వారా బీడు భూములున్న వారికి మంచి ఆదాయం రానుంది
⦿ ఇలాంటి భూములను లీజు విధానంలో తీసుకుని, వారికి ప్రతి ఏటా ఎకరాకు దాదాపు రూ.30 వేల డబ్బు చెల్లించేలా విధానం తీసుకు వస్తున్నాం
⦿ అంతేకాక రైతుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు కల్పించేదిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం
⦿ గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుల కారణంగా సుమారు 30 వేలమందికిపైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది:
⦿ పంప్డ్ స్టోరేజీ పవర్‌కి వాల్యూ అడిషన్ చేస్తున్నాం, గ్రీన్ హైడ్రోజన్, అమ్మెనియా తయారీలపై దృష్టిపెట్టాం
⦿ దీనివల్ల గ్రీన్‌ఎనర్జీ రంగంలో చాలా ముందడుగు పడుతుంది, పర్యావరణానికి కూడా మంచిది
⦿ దీనికి సంబంధించి కూడా పాలసీలు తయారుచేయాలి
⦿ ఇథనాల్ తయారీపైనకూడా దృష్టిపెట్టాలి
⦿ రాష్ట్రంలో విస్తృతంగా ధాన్యం పండిస్తున్నారు, బియ్యాన్ని వాడుకుని ఇథనాల్ తయారీపై దృష్టిపెట్టాలి
⦿ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లపైన కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలి, దీనిపై మంచి విధానాలు తీసుకురావాలి అని సిఎం వివరించారు.
త్వరలో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహాణకు సమాయాత్తమవుతున్నామని అధికారులు సిఎంకు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, మౌలికసదుపాయాలు, పెట్టుబడులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ జి సృజన, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జె సుబ్రమణ్యం, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ కె వెంకటరెడ్డి, ఏపీ టీపీసీ చైర్మన్ కె రవిచంద్రారెడ్డి, మారిటైం బోర్డు సీఈఓ షన్‌మోహన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : మేలు చేస్తుంటే ఓర్వలేరా? : సిఎం జగన్