Saturday, November 23, 2024
HomeTrending Newsగ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు ప్రశంసలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు ప్రశంసలు

Green India Challenge In Telangana Highcourt 

గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఏజీ బిఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రాంగణంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ,ఇతర న్యాయమూర్తులు, ఏజీ బిఎస్ ప్రసాద్,అడిషనల్ ఏ జి జె.రామచందర్ రావులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ను అభినందించిన సిజే సతీష్ చంద్ర తాను రైతు కుటుంబం నుండి వచ్చినట్టు గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని ప్రధాన న్యాయమూర్తి ప్రశంసల జల్లు కురిపించారు.

హైకోర్టు ప్రాంగణంలో తాను జన్మించిన అప్పటి పాత ప్రభుత్వ జజిఖాన్ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణములో సిజే సతీష్ చంద్ర శర్మ ఇతర న్యాయమూర్తులతో కలిసి మొక్కలు నాటడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ ఈ సందర్భంగా సిజే సతీష్ చంద్ర శర్మకి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ రాజశేఖర్ రెడ్డి,జస్టిస్ పి.నవీన్ రావు,జస్టిస్ జి.శ్రీదేవి,జస్టిస్ శ్రీ సుధ, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నరసింహ రెడ్డి,బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నం అశోక్ గౌడ్,బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ రావు,జీపీలు జోగినిపల్లి సాయి కృష్ణ,సంతోష్ కుమార్, పీపీలు, సీనియర్ న్యాయవాదులు ,స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్,ఫుడ్ కమిషన్ మెంబర్ గోవర్ధన్ రెడ్డి,గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read : హైదరాబాద్‌లో భారీగా గంజాయి స్వాధీనం

RELATED ARTICLES

Most Popular

న్యూస్