Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఐపీఎల్: రాజస్తాన్ పై గుజరాత్ ఘనవిజయం

ఐపీఎల్: రాజస్తాన్ పై గుజరాత్ ఘనవిజయం

Gujarath Gaints: ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ 37 పరుగులతో ఘనవిజయం సాధించింది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడి 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 87పరుగులు చేసి అజేయంగా నిలవగా, అభినవ్ మనోహర్-43 (28 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు); డేవిడ్ మిల్లర్-31 నాటౌట్ (14 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సర్)తో రాణించడంతో గుజరాత్ 193 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ కు నిర్దేశించింది.

భారీ లక్ష్య సాధనలో బరిలోకి దిగిన రాజస్థాన్ 28 పరుగుల వద్ద తొలి వికెట్ (దేవదత్ పడిక్కల్ డకౌట్) కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగాడు, కేవలం 8 పరుగులే చేసి అశ్విన్ ఔట్ కాగా….  మరో ఓపెనర్ జోస్ బట్లర్ కేవలం 24  బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి ఫెర్గ్యుసన్ బౌలింగ్ లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. కెప్టెన్ సంజూ శామ్సన్(11); రస్సె వాన్ దర్ డస్సెన్ (6) త్వరగా ఔటయ్యారు. హెట్మెయిర్ 29, రియాన్-18; జేమ్స్ నీషమ్-17 పరుగులు చేశారు. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో యష్ దయాళ్, ఫెర్గ్యుసన్ చెరో మూడు, షమీ, పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.

నవీ ముంబై లోని డా. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ జట్టు స్కోరు 12 వద్ద ఓపెనర్ మాథ్యూ వాడే (12) రనౌట్ అయ్యాడు, 15 వద్ద వీర శంకర్ (2) ఔటయ్యారు. గత మ్యాచ్ లో రాణించిన శుభ్ మన్ గిల్ ఈసారి విఫలమై 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ దశలో కెప్టెన్ పాండ్యా- అభినవ్ మనోహర్ మూడో వికెట్ కు 85 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మనోహర్ ఔటైన తరువాత డేవిడ్ మిల్లర్ పాండ్యాకు జత కలిశారు. వీరిద్దరూ రాజస్థాన్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నస్తానికి 192 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లు కుల్దీప్ సేన్, యజువేంద్ర చాహల్, రియాన్ పరాగ్ లకు తలా ఒక వికెట్ దక్కింది.

హార్ధిక్ పాండ్యా కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : ఐపీఎల్: ముంబైకు ఐదో ఓటమి-పంజాబ్ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్