Bad time: ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో కార్తికేయ ఒక్కసారిగా యూత్ కి దగ్గరయ్యాడు. యాక్షన్ తో పాటు రొమాన్స్ పుష్కలంగా ఉండటంతో ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. పాయల్ గ్లామర్ .. పాటలు ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించాయి. ఫిజిక్ పరంగా కార్తికేయ మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఆ సినిమా నుంచి ఆయన పెద్దగా గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్లాడు.
అయితే ఆ తరువాత చేసిన సినిమాలేవీ అంతగా ఆయన కెరియర్ కి ఉపయోగపడలేదు. ‘గుణ 369’ వంటి రొమాంటిక్ మూవీ .. ‘చావు కబురు చల్లగా’ వంటి మాస్ మూవీ .. ‘విక్రమార్క’ వంటి యాక్షన్ సినిమా ఆయనకి హిట్ ను ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో ‘నానీస్ గ్యాంగ్ లీడర్’లో చేసిన విలన్ రోల్ ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. తమిళంలో అజిత్ సినిమా ‘వలిమై’ నుంచి ఛాన్స్ తెచ్చిపెట్టింది. దాంతో ఇక అక్కడ ఈ తరహా వేషాలతో కార్తికేయ బిజీ కావడం ఖాయమని అనుకున్నారు.
తమిళంతో పాటు వివిధ భాషల్లో ‘వలిమై’ విడుదలైంది. అజిత్ కి గల క్రేజ్ గురించి తెలుసును గనుక, ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని కార్తికేయ భావించాడు. తమిళంలో 3 రోజుల్లో 100 కోట్లను రాబట్టిన ఈ సినిమా ఇక్కడ మాత్రం పెద్దగా సందడి చేయలేకపోయింది. వీకెండ్ తరువాత తమిళంలోను వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ఈ సినిమా పై కార్తికేయ పెట్టుకున్న ఆశలపై ఐస్ నీళ్లు చల్లినట్టు అయింది. ఈ సినిమా విషయంలోను ఆయనకి కాలం కలిసి రాకుండా పోయింది. ఆయన నెక్స్ట్ మూవీ ఏ దర్శకుడితో .. ఏ బ్యానర్లో ఉందనేది తెలియాల్సి ఉంది.