Tuesday, September 17, 2024
Homeసినిమామారేడుమిల్లి, పాడేరులో హ‌ను-మాన్‌

మారేడుమిల్లి, పాడేరులో హ‌ను-మాన్‌

స‌రికొత్త‌ కాన్సెప్టుల‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో క్రియేటివ్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ వర్మది ప్రత్యేక శైలి. ప్ర‌స్తుతం మరోసారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చూట్టారు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. హ‌ను-మాన్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీగా యంగ్‌ హీరో తేజ సజ్జతో క‌లిసి ప్రశాంత్ వర్మ తెర‌కెక్కిస్తోన్న `హను-మాన్` సినీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ కానుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి, పాడేరులో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలు, పాటల చిత్రీకరణ జ‌రగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఆన్ లొకేష‌న్ స్టిల్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. అందులో ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ తీవ్రంగా చ‌ర్చించుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ ఒక సన్నివేశాన్ని వివరిస్తుండగా, తేజ అతని మాటలు శ్ర‌ద్ద‌గా వింటున్నారు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించింది. తేజ సజ్జ సూపర్ హీరో పాత్ర పోషించడానికి స్ట‌న్నింగ్‌ మేక్ఓవర్ అయ్యారు. తేజ గెటప్ చాలా భిన్నంగా ఉంది. జాంబీ రెడ్డి కాంబో మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ద‌మైంది. హ‌ను-మాన్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో రూపొందుతోంది.

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో అత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందిస్తోంది. ప్ర‌ముఖ న‌టీన‌టులు, టాప్-గ్రేడ్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం వ‌ర్క్ చేస్తున్నారు. శ్రీ‌మ‌తి చైత‌న్య స‌మ‌ర్ప‌ణ‌లో కె. నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌, వెంక‌ట్ కుమార్ జెట్టి లైన్ ప్రొడ్యూస‌ర్‌, కుశ‌ల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌. దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్