Thursday, March 28, 2024
HomeTrending Newsడ్రగ్స్..పబ్స్..నేరాలపై ప్రో హరగోపాల్ ఆవేదన

డ్రగ్స్..పబ్స్..నేరాలపై ప్రో హరగోపాల్ ఆవేదన

తెలంగాణలో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలపై ప్రోఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. చదువు కుంటున్న పిల్లలు కూడా నేరాల్లో పాల్గొంటుటే… టీచర్లు గా మా కర్తవ్యం మేము చేస్తున్నామా అనే అనుమానం వస్తోందన్నారు. ప్రభుత్వం నేరాలు కంట్రోల్ చేయకుండా..నేరం చేస్తోందని హైదరాబాద్లో అసంహనం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు సమాజానికి ఏ విలువలు ఇస్తున్నాయో .. వాటి నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న సంఘటనలు… అధికార పార్టీ తీరు మాకు కొంత విషాద కరంగా ఉందన్నారు.

తెలంగాణ వస్తె మెరుగైన సమాజం వస్తుంది అని అనుకున్నాం కానీ.. ఇలా ఆధునికత పేరుతో ఆగడాలు, కట్టడి చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటం ప్రమాదకరమని హరగోపాల్ హెచ్చరించారు. రాజధానిలో పెరిగిన పబ్ సంస్కృతిపై ఘాటుగా స్పందించారు. మైనర్ లు పబ్ కు వెళ్ళొచ్చు.. మద్యం తాగరాదు అని అధికారులు ఎలా చెపుతారని మండిపడ్డారు. డ్రగ్స్,  రేపులు..అత్యాచారాలు… తల్లితండ్రులు పిల్లల్ని చంపడం దుర్మార్గ చర్య అని ప్రభుత్వం ఏం కట్టడి చేసింది అనేది కూడా ఆలోచన చేయాలని హితవు పలికారు. ప్రభుత్వం తెలంగాణను ప్రజాస్వామ్య సమాజంగా మార్చే ప్రయత్నం చేయడం లేదని ప్రోఫెసర్ హరగోపాల్ ఆరోపించారు.

Also Read : ఒక గంజి…ఒక కన్నోవా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్