Sunday, January 19, 2025
Homeసినిమా'హరి హర వీరమల్లు' లేటెస్ట్ అప్ డేట్

‘హరి హర వీరమల్లు’ లేటెస్ట్ అప్ డేట్

పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న మూవీ ‘హరి హర వీరమల్లు‘. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావాల్సిన వీరమల్లు ఇంకా పూర్తి కాకపోవడంతో నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు.

తాజా అప్ డేట్ ఏంటంటే… రీసెంట్ గానే పవన్ కళ్యాణ్‌ పై ఓ ఇంటెన్స్ ఇంటర్వెల్ బ్లాక్ ని కంప్లీట్ చేశారు. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అందులోని పవన్ కళ్యాణ్‌ పాల్గొనే షెడ్యూల్ అయితే ఈ జనవరి 17 నుంచి స్టార్ట్ కానుందట. మరి హైదరాబాద్ సారథి స్టూడియోస్ లో ఈ షూట్ ని మేకర్స్ ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. మరి మేకర్స్ అయితే.. చిత్రాన్ని ఈ సమ్మర్ లోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బాగా లేట్ అవ్వడంతో ఎట్టి పరిస్థితుల్లోను వీరమల్లు చిత్రాన్ని సమ్మర్ కి రిలీజ్ చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారని సమాచారం.

అలాగే ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగాసూర్య ప్రొడక్షన్స్ వారు భారీ వ్యయంతో సినిమాని నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ హోమ్ వర్క్ చేస్తుండడం విశేషం. అవును.. ఇందులోని యాక్షన్ సీన్స్ కోసం ట్రైనింగ్ తీసుకుని.. రిహాల్స్ చేసి మరి నటిస్తుండడం విశేషం. ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్‌ ఇలా చేసింది వీరమల్లు కోసమే. ఆయనకు కథ అంతగా నచ్చడంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ మూవీకి ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. మరి.. వీరమల్లు ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్