Monday, January 20, 2025
Homeసినిమావీరమల్లు అప్ డేట్ ఏంటి..?

వీరమల్లు అప్ డేట్ ఏంటి..?

పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పీరియాడిక్ మూవీ ‘హరి హర వీరమల్లు‘. ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కు జంటగా నిధి అగర్వాల్ నటిస్తుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడు వీరమల్లు విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. వీరమల్లు మాత్రం ఆలస్యం అవుతునే ఉంది.

ఇటీవల పవన్ కళ్యాణ్‌ వరుసగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ (ఓరిజినల్ గ్యాంగ్ స్టర్), ‘వినోదయ సీతం’ చిత్రాలు ప్రారంభించారు. దీంతో వీరమల్లు షూటింగ్ కి బ్రేక్ పడింది. సమ్మర్ కి విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. పోస్ట్ పోన్ అయ్యింది. ప్రస్తుతం వినోదయ సీతం రీమేక్ షూటింగ్ లో పవన్ పాల్గొంటున్నారు. ఈ నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. ఆతర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ షూటింగ్ లు కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. దీంతో వీరమల్లు పరిస్థితి ఏంటి..? ఎప్పుడు వీరమల్లు విడుదల అవుతుందని ఆరా తీస్తున్నారు అభిమానులు.

వీరమల్లు లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఇంకా ఈ మూవీకి దాదాపు 20 నుంచి 40 రోజుల మేర షూటింగ్ బాలన్స్ ఉందట. అలాగే వి ఎఫ్ ఎక్స్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ లో పవన్ ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది మార్చ్ 14 తర్వాత అయితే క్లారిటీ రానుందని తెలిసింది. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి దసరాకి అయినా విడుదల చేయాలి అనుకుంటున్నారట మేకర్స్. మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వీరమల్లు రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటిస్తారని సమాచారం. మరి.. దసరాకి అయినా వీరమల్లు వస్తుందో లేదో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్