Sunday, January 19, 2025
Homeసినిమాపవన్ నిర్ణ‌యంతో హరీష్ శంకర్ కు దడ?

పవన్ నిర్ణ‌యంతో హరీష్ శంకర్ కు దడ?

Harish-Troubles: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు అనౌన్స్ చేశారు. ఇది ఒక ర‌కంగా అభిమానుల‌కు స‌ర్ ఫ్రైజ్ గానే అనిపించింది. వ‌కీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీలో స‌క్సెస్ సాధించిన ప‌వ‌ర్ స్టార్ ఆత‌ర్వాత భీమ్లా నాయ‌క్ మూవీతో మ‌రో స‌క్సెస్ సాధించారు. అయితే.. క్రిష్ డైరెక్ష‌న్ లో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమాను ఎప్పుడో ప్రారంభించారు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు కంప్లీట్ చేయ‌లేదు. ఇది భారీ పాన్ ఇండియా మూవీ.

ఇప్ప‌టి వ‌ర‌కు యాభై శాతం మాత్ర‌మే పూర్త‌య్యింది. క‌రోనా కార‌ణంగా వాయ‌దా పడుతూనే ఉంది. త్వ‌ర‌లో తాజా షెడ్యూల్ స్టార్ట్ అవుతుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వస్తూనే ఉన్నాయి కానీ.. లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కావ‌డం లేదు. ఇలాంటి టైమ్ లో ప‌వ‌ర్ స్టార్ పొలిటిక‌ల్ గా బిజీ అయ్యారు. ఏపీలో ప్ర‌త్యేక టూర్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ద‌స‌రా త‌ర్వాత ఈ టూర్ స్టార్ట్ కానుంది. దీంతో ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న సినిమాల ప‌రిస్థితి ఏంటి అనేది ఆస‌క్తిగా మారింది.

అయితే.. అక్టోబ‌ర్ లోపు వీర‌మ‌ల్లు షూటింగ్ చేసుకోవాల్సిందిగా క్రిష్ కి ప‌వ‌న్ చెప్పార‌ట‌. ఈ సినిమాతో పాటు స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ష‌న్ లో చేసే మూవీకి 20 రోజులు డేట్స్ ఇచ్చార‌ట ప‌వ‌న్. ఈ రెండు సినిమాలు పూర్తైన త‌ర్వాత భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ గురించి ఆలోచిస్తాడ‌ట‌. దీంతో డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాని ఎప్పుడో ప్ర‌క‌టించారు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఎప్పుడు వెళుతుందో క్లారిటీ లేదు. మ‌రి.. హ‌రీష్ శంక‌ర్ ప‌వ‌న్ డేట్స్ కోసం ఇంకా వెయిట్ చేస్తాడో..?  లేక వేరే హీరోతో మ‌రో సినిమా చేస్తాడో చూడాలి.

Also Read ప‌వ‌న్ కోసం రాసిన క‌థ‌తో స‌త్య‌దేవ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్