Sunday, January 19, 2025
Homeసినిమావిజయ్ - హరీష్ కాంబినేషన్ సినిమా సెట్.?

విజయ్ – హరీష్ కాంబినేషన్ సినిమా సెట్.?

విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ ఫ్లాప్ తర్వాత బాగా అప్ సెట్ అయ్యాడు. ప్రస్తుతం ‘ఖుషి‘ అనే సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న  ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. అయితే.. లైగర్ లెసన్ తో ఇక నుంచి ఎలాంటి సినిమాలు చేయాలి..?  అనే విషయం గురించి బాగా ఆలోచిస్తున్నాడట. అందుకనే ఎన్ని ఆఫర్స్ వచ్చినా.. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినా విజయ్ ఓకే చెప్పలేదు. ఇటీవల విజయ్ కి హరీష్‌ శంకర్ కథ చెప్పాడని… ఈ కథ నచ్చలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు విషయం ఏంటంటే.. ఇప్పటి వరకూ విజయ్ కి హరీష్ శంకర్ కథ చెప్పలేదు. విజయ్ కి కథ చెప్పడానికి హరీష్ కొంత సమయం అడిగాడు. వారం పది రోజుల్లో… ఒక మీటింగ్ ఉంటుంది. ఆతర్వాత ఈ కాంబో సెట్ అవుతుందో లేదో అనేది తెలుస్తుంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఎందుకంటే పవన్ సినిమా కోసం మైత్రీ దగ్గర హరీష్ అడ్వాన్స్ తీసుకున్నాడు. దానికి న్యాయం చెయ్యాలి. ఈ సినిమాలో ‘జనగణమన’ నిర్మాతలూ భాగస్వాములుగా వుంటారని తెలిసింది.

ఎందుకంటే.. పూరితో విజయ్ దేవరకొండ చేయాల్సిన జనగణమన  సినిమా కూడా ఆగిపోయింది. కనుక ఆ నిర్మాతలకు విజయ్ ఒక సినిమా చేయాలి. అయితే.. విజయ్ దేవరకొండ హరీష్ శంకర్ స్టోరీతో పాటు పరశురామ్ స్టోరీ, గౌతమ్ తిన్ననూరి స్టోరీ కూడా వినబోతున్నాడని తెలిసింది. దీంతో హరీష్ శంకర్, పరశురామ్, గౌతమ్ తిన్ననూరి ఈ ముగ్గురులో ఎవరి కథకు ఓకే చెబుతాడు అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్