కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, జగ్గారెడ్డి కళ్లు ఉండి లేనట్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దావాఖానా అని పాడేవారు. ఇప్పుడు సర్కారు ఆసుపత్రికే పోతా అని అంటున్నారని చెప్పారు. హైదరాబాద్ అమీర్ పెట్ లో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో కలిసి మంత్రి హరీష్ రావు ప్రభుత్వ అస్స్పత్రి సందర్శించారు. గీతారెడ్డి డాక్టర్ అయ్యు ఉండి ఇలా మాట్లాడటం తగదని హితవు పలికారు. జగ్గారెడ్డి సంగారెడ్డి ఆసుపత్రి వెళ్లి అభినందించారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మీ పక్కనే ఉన్నారు అడగండని గీతా రెడ్డిని కోరారు.
కాంగ్రెస్ హయాంలో జిల్లా మెడికల్ కాలేజీ పెట్టాలని సోయి ఉందా అని విమర్శించిన మంత్రి హరీష్ 70 ఏళ్లల్లో 3 మెడికల్ కాలేజీలు ఉంటే, 7 ఏళ్లలో 33 కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. కాలేజీలు పెడితే ఎందుకు పిల్లలు ఉక్రెయిన్, చైనా వెళ్లారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే ఏసీ కార్లలో లో ఉంటారు..మేము బస్తీల్లో ఉంటామన్నారు. కాంగ్రెస్ అంటే గతం. ప్రస్తుతం ఆగమాగమని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ లో ఒక లీడర్ కు మరొక లీడర్ మాటలకు పొంతన ఉండదని, కాంగ్రెస్ మాటల పార్టీ, చేతల పార్టీ కాదన్నారు. నాడు వానాకాలం లో ఏజెన్సీలు మంచం పట్టెవి ఇప్పుడు ఉన్నాయా అని మంత్రి అడిగారు. మీ జహీరాబాద్ ఆసుపత్రి చూడు.. ఏమేమెం చేశామో అని గీత రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు సర్కారు దవాఖానలను విమర్శించే హక్కు లేదన్నారు. మేము రోజూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటున్నాం. కళ్ళు ఉండి చూడలేని కబోదిలా ఉంది కాంగ్రెస్ నేతల వ్యవహారం అని మంత్రి హరీష్ విమర్శించారు.
Also Read : ఏరియా ఆస్పత్రిలో మంత్రి హరీష్ ఆకస్మిక తనిఖీ