Heavy Encounter In Gadchiroli District :
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లా ధనోర తాలుక గ్యారబట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు,మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భీకరంగా సాగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు చనిపోయారు. ఎంతమంది గాయపడింది తెలియరాలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. కోర్చి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రాథమిక సమాచారం.
కోర్చి పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు సమావేశం అయినట్టు సమాచారం రావటంతో గడ్చిరోలి పోలీసులు వారిపై దాడి చేయగా ఏడుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఎన్ కౌంటర్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భీకర కాల్పుల్లో మావోలకు భారీగా నష్టం జరిగినా పోలీసుల వైపు ఏమి జరగకపోవటం అనుమానాలకు తావిస్తోంది.
ఇవి కూడా చదవండి: ఛత్తీస్ ఘడ్ లో ఎన్‌కౌంటర్, ముగ్గురి మృతి