మండోస్ తుఫాను ధాటికి పెన్నానదికి భారీ వరద చేరింది. దీనితో పెన్నా పరివాహక ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. మైలవరం నుంచి పెన్నానదికి 2 వేల క్యూసెక్కుల నీరు విడుదలైంది. సాయంత్రంలోగా 4 వేల క్యూసెక్కుల నీరు విడుదల అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. పెన్నా పరివాహక ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గండికోట నుంచి మైలవరానికి 4 వేల క్యూసెక్కులు విడుదలయ్యింది. గండికోటలో 26.4 టీఎంసీలు, మైలవరంలో 6 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
మరోవైపు మాండూస్ ధాటికి సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం దగ్గర సముద్రంలో మరబోటు చిక్కుకుంది. బోటులో ఏడుగురు మత్యకారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. తుఫాన్ తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.