Sunday, January 19, 2025
Homeసినిమామహేష్ మూవీ కోసం భారీ సెట్!

మహేష్ మూవీ కోసం భారీ సెట్!

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అతడు, ఖలేజా చిత్రాలు రూపొందాయి.  హ్యాట్రిక్ కాంబినేషన్ గా ఓ సినిమా ప్రస్తుతం రూపొందుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ దీన్ని నిర్మిస్తున్నారు. మహేష్‌ సరసన క్రేజీ హీరోయిన్స్ పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా తొలి షెడ్యూలు ఇటీవలే సారథి స్టూడియోలో ముగిసింది. ఇందుకోసం సారథి స్టూడియోలో పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఓ ఓల్డ్ మోడల్ డాబా ఇల్లు సెట్ వేశారు.  రెండో షెడ్యూలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కాబోతోంది.

ఇందుకోసం నగర శివార్లలో ఓ భారీ ఇంటి సెట్ నిర్మాణం జోరుగా జ‌రుగుతోంది. దాదాపు 10 కోట్ల రూపాయలను ఇందుకోసం వెచ్చిస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఇంత భారీ ఇంటి సెట్ నిర్మాణం చేయలేదనేంత రేంజ్ లో ఈ సెట్ ను నిర్మిస్తున్నారని తెలిసింది. కొన్ని వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెట్ వుంటుంది. అది కూడా కేవలం ఒక్క ఫ్లోర్ మాత్రమే అని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనుకోవడంతో మహేష్‌ బాబు గ్యాప్ లేకుండా వర్క్ చేస్తున్నారు. మార్నింగ్ సెవెన్ కే మహేష్‌ కి సెట్ కి వచ్చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత రాజమౌళితో మూవీని స్టార్ట్ చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్