Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్ కోసం రెడీ అవుతున్న భారీ పోర్టు సెట్!

ఎన్టీఆర్ కోసం రెడీ అవుతున్న భారీ పోర్టు సెట్!

ఎన్టీఆర్ కి ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత చాలా గ్యాప్ వచ్చేసినట్టే. కొరటాలతో ఒక ప్రాజెక్టు అనుకుని దానికి కట్టుబడి ఉన్నప్పటికీ, ఆ ప్రాజెక్టు అనేక రకాల కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది.  కల్యాణ్ రామ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమా విషయంలో, స్క్రిప్ట్ పై కసరత్తు చేయడానికే ఎక్కువ సమయం పట్టింది. మొత్తానికి ఫైనల్ స్క్రిప్ట్ ను లాక్ చేసుకున్నారు. వచ్చేనెల నుంచి రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు.

ఈ కథ సముద్రం నేపథ్యంలో కొనసాగనుంది. సముద్రం ద్వారా జరిగే స్మగ్లింగ్ .. మాఫియా నేపథ్యంలో కథ నడుస్తుంది. అందువలన సముద్ర తీరంలో షూట్ చేయవలసిందే. విశాఖలో గానీ .. చెన్నైలో గాని ఇందుకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించవచ్చునని అంతా అనుకున్నారు. అయితే అత్యంత ముఖ్యమైన ఒకటి రెండు సన్నివేశాలను చెన్నై సముద్ర తీరంలో కానిచ్చేసి, ఆ తరువాత సీన్స్ ను ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో .. బ్లూ మ్యాట్ లో చిత్రీకరించనున్నారని సమాచారం.

ఈ సినిమాకి సాబూ సిరిల్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆయన పోర్టు సెట్ ను వేయిస్తున్నట్టు చెబుతున్నారు. సినిమా అంతా కూడా సముద్రతీరంలో జరుగుతున్నట్టుగానే అనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. కెరియర్ పరంగా  ఎన్టీఆర్ కి ఇది  30వ సినిమా. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, ఈ దసరాకి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్