Saturday, January 18, 2025
Homeసినిమాహెబ్బా పటేల్ కొత్త సినిమా ప్రారంభం

హెబ్బా పటేల్ కొత్త సినిమా ప్రారంభం

కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం ఆడోరకం, ఎక్కడికిపోతావు చిన్నవాడా, నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్.. తదితర చిత్రాల్లో నటించి యూత్ ని బాగా ఆకట్టుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్. ఇటీవల కాలంలో కెరీర్ లో కాస్త వెనకబడింది. ఇప్పుడు హెబ్బా పటేల్ కొత్త సినిమా ప్రారంభించింది. ఇందులో అర్చన, ఆశు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

కార్తీక్ గరిమెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి శ్యామ్ దేవభక్తుని నిర్మాత. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా వైభవంగా ప్రారంభమైయింది. గ్రాండ్ గా జరిగిన ఈ చిత్రం పూజా కార్యక్రమానికి హాజరైన కెఎస్ రామారావు, సుహాస్ కృష్ణ దేవభక్తుని క్లాప్ ఇవ్వగా, రమేష్ బాబు గరిమెళ్ల కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

అనిల్ బాబు మండవ, నాగినీడు స్క్రిప్ట్ అందించగా కెఎల్ నారాయణ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అన్నే రమేష్ గౌరవ అతిధిగా హాజరయ్యారు. ఈ చిత్రానికి సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తుండగా అర్జున్ రవి డీవోపీగా పని చేస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి అఖిల దాసరి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

Also Read రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా ‘తెలిసినవాళ్లు’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్